Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'మాస్ట్రో'. 'అందాధున్' రీమేక్‌గా ఈ సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల17న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ,'ఎప్పటి నుంచో నితిన్‌తో కమర్షియల్, కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ 'అంధాదున్' లాంటి ఆర్టిస్టిక్ సినిమా చేశా. నితిన్ బాగా చేశారు. తమన్నాను మిల్కీ బ్యూటీ అంటే ఏదోలా ఉంది. ఇప్పటి నుంచి ఆమెను గ్రేట్ ఆర్టిస్ట్ అని అంటారు. నభా కూడా అద్భుతంగా నటించారు. మహతి స్వర స్వాగర్ సంగీతం, నేపథ్యం సంగీతాన్ని అద్భుతంగా ఇచ్చారు. ఈ నెల 17న హాట్ స్టార్‌లో ఈ సినిమా రాబోతోంది. సినిమా చూసి కచ్చితంగా పోల్చుతారు. తిట్టడానికైనా, పొగడటానికైనా సరే సినిమాని తప్పకుండా చూడండి' అని అన్నారు.
''అంధాదున్' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రాధికా ఆప్టే పాత్రకు సరిపోతానని నమ్మినందుకు దర్శకుడు గాంధీకి థ్యాంక్స్. నితిన్‌తో నాకు ఇది మొదటి సినిమా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు ముఖంలో చిరునవ్వు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఓటీటీలో వస్తున్నాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి. కచ్చితంగా మీరు ఎంజారు చేస్తారు' అని కథానాయిక నభా నటేష్ చెప్పారు.