Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'లెహరాయి..' లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ పాటకు వస్తున్న అనూహ్య స్పందన గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, ''లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహ లెగిరాయి.. లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి.. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..' అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.అలాగే ఈ పాటలో అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా దర్శకుడు భాస్కర్ డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అన్ని పాత్రలను ఆయన అలాగే డిజైన్ చేశారు. ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు' అని తెలిపింది. ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభరు, అమిత్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి, మ్యూజిక్ : గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ, ఎడిటర్ : మార్తాండ్.కె.వెంకటేష్.