Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ, 'ఈ సినిమా రిలీజ్ రోజున వినాయకుడి ఆశీస్సులతో సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుందని చెప్పాను. అన్నట్లుగానే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకొస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకం నిజమైంది. ప్రేక్షకులు మాకు చాలా పెద్ద విజయాన్ని అందించారు. నేను జెన్యూన్‌గా హిట్ అనే మాట విని చాలా కాలమైంది. అంతకు ముందు హిట్స్ వచ్చాయి. కానీ, ఈ మధ్య కాలంలో నా సినిమాలను హిట్ అని విన్లేదు. ఈ సినిమా ఆ కొరత తీర్చేసింది. నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, పవన్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ల పడ్డ కష్టానికి ఈరోజు ఇంత పెద్ద హిట్ వచ్చింది' అని చెప్పారు.
''గౌతమ్ నంద' సమయంలో నేను, గోపీచంద్‌గారు ఓ బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తున్నామని అనుకున్నాం. కానీ ఎందుకో ఆ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయింది. కానీ 'సీటీమార్'తో ఆయన బాకీ తీర్చేసుకున్నాను. సినిమా తొలి ఆట తర్వాత సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి 'సింహా' అప్పుడు బాలకష్ణ, బోయపాటి ఎలాంటి హిట్ కొట్టారో, ఇప్పుడు మీరూ, గోపీచంద్ అంత పెద్ద బ్లాక్‌బస్టర్ కొట్టారని చెప్పారు. ఇది కేవలం మాస్, కమర్షియల్ సినిమా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత గురించి, అమ్మాయిలు పడే ఇబ్బందులు, వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ గురించి చెప్పే సినిమా. ఆడవాళ్ల విజయం కోసం నిలబడ్డ ఓ అన్నయ్య కథే ఈ సినిమా. మీరు వందరూపాయలు పెట్టి ఈ సినిమా చూస్తే, వెయ్యి రూపాయల ఆనందాన్నిచ్చే సినిమా అని నమ్మకంతో చెబుతున్నాను' అని దర్శకుడు సంపత్‌నంది తెలిపారు. తమన్నా మాట్లాడుతూ, 'బోల్డెన్ని సమస్యలు తర్వాత ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఓ బ్లాక్‌బస్టర్ సినిమా తీయాలనే కోరికే ఈ సక్సెస్‌కు కారణం. ఈ సినిమా సక్సెస్ నాకూ చాలా ముఖ్యం' అని అన్నారు.