Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనీష్ హీరోగా రూపొందిన చిత్రం 'మరో ప్రస్థానం'. జానీ దర్శకుడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదరు కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ,'ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అతి తక్కువ టైమ్‌లో చిత్రీకరణ కంప్లీట్ చేశాం. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ నెల 24న థియేటర్లలో మా చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం' అని చెప్పారు.
'ఇదొక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. ఈ సినిమాలో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి' అని దర్శకుడు జానీ అన్నారు. హీరో తనీష్ మాట్లాడుతూ, 'నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న వాస్తవ ఘటనలు, బర్నింగ్ ఇష్యూస్ చూపిస్తున్నాం. థ్రిల్ చేసే వన్ షాట్ ఇంటెన్స్, కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా కథాపరంగా, టెక్నికల్‌గానూ చాలా స్ట్రాంగ్' అని తెలిపారు.