Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్తగిరి, నేహా సోలంకి జంటగా రూపొందుతున్న చిత్రం 'గూడు పుఠాణి'. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్నారు. కె.యమ్.కుమార్ దర్శకుడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ, 'ఈ చిత్ర ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను' అని చెప్పారు. 'ఇందులో సప్తగిరి అద్భుతంగా నటించాడు. దర్శకుడు కొత్తవాడైనా కూడా తాను ఎంచుకున్న పాయింట్ బాగుంది. ప్రేక్షకులకు కావలసిన సాంగ్స్, స్టోరీ, ఫైట్స్ అన్ని సమపాళ్లలో ఉన్నాయి' అని నిర్మాతలు చెప్పారు. హీరో సప్తగిరి మాట్లాడుతూ, 'సూపర్ స్టార్ కష్ణ నటించిన 'గూడుపుఠాణి' టైటిల్‌తో నేను సినిమా చేయడం అదష్టం' అని అన్నారు.'సెన్సార్ వాళ్ళు కూడా సినిమా చాలా బాగుందన్నారు. ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంగేజ్ చేస్తుంది' అని దర్శకుడు కుమార్ అన్నారు.