Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'ఇక్షు'. ఋషిక దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్నారు.
డా|| గౌతమ్ నాయుడు సమర్పకుడిగా ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సందర్భంగా డైరెక్టర్ రిషిక మాట్లాడుతూ, 'మా హీరో రామ్ అగ్నివేశ్‌కి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న హీరోలా నటించారు. శుక్రవారం తన బర్త్‌డే సందర్భంగా మా సినిమా ఏవీని రిలీజ్ చేశాం' అని తెలిపారు.'మా హీరో రామ్ అగ్నివేశ్ పుట్టినరోజు నేపథ్యంలో రిలీజ్ చేసిన ఏవీకి మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌ని మా హీరో సింగిల్ టేక్‌లో చేసి, లొకేషన్లో కూడా సింగల్ టేక్ ఆర్టిస్ట్‌గా టీమ్ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కి ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ట్రైలర్‌ని లాంచ్ చేయబోతున్నాం. అందరినీ మెప్పించి అన్ని కమర్షియల్ హంగులున్న చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాత హనుమంతురావు నాయుడు అన్నారు.
చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, జడి సాయి కార్తీక్ గౌడ్, మూల కథ: సిద్ధం మనోహర్, కెమెరా: నవీన్ తొడిగి, పాటలు : కాసర్ల శ్యామ్, మ్యూజిక్: వికాస్ బాడిస, ఎడిటింగ్: ఎస్బి.ఉద్ధవ్, మాటలు: మున్నా ప్రవీణ్, కొరియోగ్రఫీ: భాను.