Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషానారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మిస్సింగ్'. బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ షూటింగ్‌ని హైదరాబాద్‌లో చేశారు. ఈ షూటింగ్ లొకేషన్లో చిత్ర బందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దర్శకుడు మాట్లాడుతూ, 'రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. కరోనా వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయినప్పటికీ పట్టుదలతో సినిమాని కంప్లీట్ చేశాం. ఈ సినిమా కోసం స్పెషల్‌గా ఓ ప్రమోషనల్ సాంగ్‌ని షూట్ చేస్తున్నాం. త్వరలోనే థియేటర్లో మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాతో కచ్చితంగా మంచి హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు.
'ఇదొక మిస్టరీ థ్రిల్లర్. నాకు తొలి చిత్రంలోనే పలు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం అదష్టంగా భావిస్తున్నాను' అని హీరో హర్షా నర్రా చెప్పారు. నిర్మాతలు భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు మాట్లాడుతూ,'ఈ సినిమాకి మంచి మ్యూజిక్ కుదిరింది. 'ఓలా ఓలా..' లాంటి పాటలు ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. ఈ ప్రమోషనల్ సాంగ్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు.