Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరికొత్త సీరియల్స్‌తో ఎప్పటికప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయటంలో జీ తెలుగు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్‌లో నటిస్తున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎప్పటికప్పుడు ఒకే వేదికపైకి తీసుకురావడంలోనూ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో దశాబ్దకాలం పాటు 'జీ కుటుంబం అవార్డుల' కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. ఈ క్రమంలో భాగంగా తాజాగా 11వ 'జీ కుటుంబం అవార్డు' వేడుకకు రంగం సిద్ధం చేసింది.
అద్భుతమైన కథలతో, ఆకట్టుకునే మలుపులతో ఎన్నో సీరియల్స్‌ని అందిస్తున్న జీ తెలుగు, సాధారణ ప్రజల కష్టసుఖాలను ప్రధాన ఇతివత్తాలుగా తీసుకుని, వాటిని ఆకట్టుకునే రీతిలో అందిస్తూ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. కష్ట మొచ్చినా కరగనిది, నష్ట మోచ్చినా చెరగనిది బంధాలతో నిండిన బంగారు కుటుంబం.. జీ తెలుగు వారి కుటుంబం అనేలా, ఆ అనుబంధాల్ని ఒక వేడుకలా చేసుకోవడమే ఈ జీ కుటుంబం అవార్డుల పండుగ అని అంటున్నారు జీ తెలుగు ఛానెల్ ప్రతినిధులు. ఈ అవార్డుల వేడుక గురించి జీ తెలుగు బృందం మాట్లాడుతూ, 'ఈ అవార్డుల కార్యక్రమంలో పాపులర్ వ్యూయర్స్ ఛాయిస్ నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డుల వరకు ఎన్నో కేటగిరీలు ఉన్నాయి. అలాగే ఇందులో విజేతల్ని ఓటింగ్ ప్రాసెస్ ద్వారా ఎన్నుకోవచ్చు. 57575 నెంబర్‌కు ఎస్ ఎం ఎస్ ద్వారా, జీ తెలుగు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జీ 5 యాప్, వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి జీ కుటుంబం అవార్డ్స్ పోర్టల్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. ఈ ఓటింగ్ ప్రాసెస్ ఈనెల15 నుండి 30 వరకు కొనసాగనున్నది. అతి త్వరలోనే ఈ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది' అని చెప్పారు.