Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట:
18 ఏండ్లు పై బడిన ప్రతొక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే దృడ సంకల్పంతో కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు,అధికారులు గత మూడు రోజులుగా విస్త్రుత ప్రచారం చేసినప్పటికీ వ్యాక్సిన్ కొరత వేధిస్తుంది.ఈ నెల 16 ప్రారంభం అయిన ప్రత్యేక వ్యాక్సిన్ శిబిరాల్లో మండలంలోని ప్రతీ వైద్య ఉపకేంద్రం పరిధిలో 100 టీకాలు లక్ష్యంగా వ్యాక్సినేషన్ చేయాలని స్వయానా కలెక్టరే హుకుం జారీ చేసారు.కానీ ఆ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో లక్ష్యం నీరు కారుతుంది.
ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ శిబిరం - 2021
మండలం : అశ్వారావుపేట.
ఆసుపత్రులు : 02
సబ్ సెంటర్స్ : 16
అశ్వారావుపేట (వినాయయకపురం) పి.హెచ్.సి (12)
గుమ్మడవల్లి (04)
లక్ష్యం : రోజు కి 1600 డోస్ లు
గురువారం (16/09/21) 523
శుక్రవారం (17/09/21 ) 1778
శనివారం (18/09/21 ) 1571
మొత్తం : 3872
ఆసుపత్రులు వారీగా....
అశ్వారావుపేట (వినాయకపురం).
గురువారం (16/09/21) 391
శుక్రవారం (17/09/21) 1318
శనివారం (18/09/21) 1172
మొత్తం : 2881
గమ్మడవల్లి....
గురువారం (16/09/21) 132
శుక్రవారం (17/09/21) 460
శనివారం (18/09/21) 399
మొత్తం : 991
16 ఉపకేంద్రాల పరిధిలో కేంద్రానికి 100 చొప్పున రోజుకి 1600 వందలు డోస్ లు చొప్పున 4800 డోస్ లు చేయాలి.వ్యాక్సాన్ కొరత ఉండడంతో 3871 మాత్రమే టీకాలు వేసారు.
ఈ విషయం పై అశ్వారావుపేట (వినాయకపురం) ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రాంబాబు ను వివరణ కోరగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ను సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు.