Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు నవ్వులను పంచిన బ్రహ్మానందం ఃపంచ తంత్రంః సినిమా కోసం కథకుడిగా కొత్త అవతారం ఎత్తారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజరు, నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ఃపంచతంత్రంః. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్, సజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. కథకుడు వేదవ్యాస్‌గా బ్రహ్మానందం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో కథకుడు రెడీ అంటూ మైక్ ముందు మాట్లాడుతున్న బ్రహ్మానందం లుక్ అందర్నీ అలరిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ,ఃరెండేళ్ల విరామం తర్వాత బ్రహ్మానందం నటిస్తున్న చిత్రమిది. గతంలో కొన్ని సన్నివేశాలను ఆయనపై తెరకెక్కించాం. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్లో బ్యాలెన్స్ ఉన్న సన్నివేశాలను పూర్తి చేశాం. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. నవంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాంః అని తెలిపారు.
కామెడీ క్యారెక్టర్‌కు భిన్నంగా సరికొత్త పాత్రలో వేదవ్యాస్‌గా బ్రహ్మానందం ఇందులో కనిపించబోతున్నారు. డ్రామా, సెంటిమెంట్ అంశాలతో హదయాల్ని హత్తుకునేలా ఉన్న వేదవ్యాస్ పాత్ర సినిమాకి ప్రధానాకర్షణగా నిలుస్తుందిః అని దర్శకుడు హర్ష పులిపాక అన్నారు.