Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అతడెవడు'. వెంకట్ రెడ్డి నంది దర్శకుడు. ఎస్.ఎల్.ఎస్ సమర్పణలో తోట క్రియేషన్స్ బ్యానర్‌పై తోట సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్, టీజర్ లాంచ్ వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను దర్శకుడు చంద్రమహేష్, దర్శకుడు తోట వేణు సంయుక్తంగా విడుదల చేయగా, పోస్టర్‌ను నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు జాకీ రిలీజ్ చేేశారు.
ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ, '1989లో అప్పటి సమాజానికి తగ్గట్టుగా తోట రామ్మోహనరావుగారు 'లేచింది మహిళా లోకం' చిత్రాన్ని నిర్మిస్తే, ఇప్పుడు ఆయన కొడుకు తోట సుబ్బారావుగారు ఇప్పటి సమాజానికి తగ్గట్టు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా' అని తెలిపారు.
'సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెలాఖరుకి ఆడియో ఫంక్షన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సెన్సార్‌కి కూడా డేట్ ఫిక్సయింది. వచ్చే నెల థియేటర్లలో సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని దర్శకుడు వెంకట్ రెడ్డి నంది అన్నారు.
నిర్మాత తోట సుబ్బారావు మాట్లాడుతూ, 'దర్శకుడు ఈ కథ చెప్పగానే, వెంటనే సినిమాని ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేశాం. హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు అందరూ చాలా బాగా సహకరించారు' అని చెప్పారు.