Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అరవై ఏళ్ల సావిత్రి తన భర్త సత్యమూర్తి తప్పిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆనవాలుగా ఇరవై ఏళ్ల యువకుడి ఫొటో ఇచ్చి, ఇతనే తన భర్త అని చెబుతుంది. ఇరవై ఏళ్ల యువకుడు, అరవై ఏళ్ల ఆవిడ ఎలా భార్యాభర్తలు అయ్యారో తెలియాలంటే మా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు దర్శక, నిర్మాతలు.
హాస్యనటి శ్రీలక్ష్మి, పార్వతీశం జంటగా నటిస్తున్న చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' . ఎ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హిలేరియన్ ఎంటర ్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు బాబీ శనివారం విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందని, సినిమా విజయవంతం కావాలని బాబీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ, 'దర్శకుడు బాబీ మా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేేయడం ఆనందంగా ఉంది. అరవై ఏళ్ల సావిత్రి తన భర్త తప్పిపోయాడని ఇరవై ఏళ్ల సత్యమూర్తి ఫొటోను పోలీసులకు చూపించే సన్నివేశంతో మా ట్రైలర్ వినోదాత్మకంగా మొదలైంది. సీనియర్ సిటిజన్స్ అందరూ ఇరవై ఏళ్ల సత్యమూర్తిని అన్నయ్య, పెదనాన్న, క్లాస్మేంట్ అంటూ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా ఇరవై ఏళ్ల వయసులో సత్యమూర్తి లైఫ్‌లో ఏదో జరిగిందంటూ సస్పెన్స్‌నీ జోడించారు. కామెడీ, సస్పెన్స్, రొమాన్స్ అంశాలతో ట్రైలర్ విందుభోజనంలా ఉండటంతో అందర్నీ విశేషంగా అలరిస్తోంది. చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ఆడియోని విడుదల చేస్తాం. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
'పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు కడుపుబ్బా నవ్విస్తుంది' అని దర్శకుడు చైతన్య కొండ తెలిపారు.