Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రంలోని 'అడిగా అడిగా' అంటూ సాగే తొలి పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
'నాయకానాయికలు బాలకష్ణ, ప్రగ్యా జైస్వాల్ ఒకరిపట్ల మరొకరికి ఎంత ప్రేమ ఉందో చూపించేలా ఈ పాట ఉండటం విశేషం. 'అడిగా అడిగా.. పంచ ప్రాణాలు నీ రాణిగా..' అంటూ సాగే ఈ మెలోడీి కోసం తమన్ అద్భుతమైన ట్యూన్ అందిం చారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను గాయనీ గాయకులు ఎస్పీ చరణ్, ఎం.ఎల్.శ్రుతి ఎంతో శ్రావ్యంగా పాడారు. ఈ పాటకు సర్వత్రా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రియుల్ని విశేషంగా అలరిస్తోంది. బాలకష్ణ, ప్రగ్యా జోడి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోన్నట్టు ఈ పాటలోని మేకింగ్ చెప్పకనే చెబుతోంది. కొరియోగ్రఫీ సైతం పాటకు తగ్గట్టు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలూ చాలా రిచ్‌గా ఉన్నాయి. బోయపాటి శ్రీను సినిమాలంటే కచ్చితంగా మంచి మెలోడీ పాట ఉండాల్సిందే. ఆ కోవలోనే ఈ సినిమాలోనూ ఆయన మార్క్‌తో మెలోడీ సాంగ్ ఉంది. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.