Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'కజ్జా'. ఎంటీిబీ నాగరాజు సమర్పణలో ఎస్ఎస్ఇ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్. చంద్రు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆర్.చంద్రశేఖర్ నిర్మాత. శనివారం హీరో ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను దర్శక, నిర్మాతలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, '1960 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ఉపేంద్ర పక్కా మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్ వైరల్ అయ్యింది. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ సైతం ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ని దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు' అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎంటీబీ నాగరాజు, ఎడిటర్: మహేష్ రెడ్డి, ఆర్ట్: శివ్ కుమార్, సంగీతం: రవి బసర్, నిర్మాత: ఆర్.చంద్రశేఖర్, దర్శకుడు: ఆర్.చంద్రు.