Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణ్ విజయ్, దర్శకుడు హరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'యానై' (తెలుగులో 'ఏనుగు') తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 33 మంది సెలెబ్రిటీలు ఒకేసారి ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం ఓ విశేషమైతే, ఈ చిత్ర పోస్టర్ని అరుణ్ విజయ్ అభిమానులు ఏకంగా సముద్ర గర్భంలో రిలీజ్ చేయడం మరో విశేషం. శనివారం పుదుచ్చేరికి చెందిన అరుణ్ విజయ్ ఫ్యాన్స్ 'యానై' పోస్టర్‌ను సముద్రగర్భంలో ఆవిష్కరించారు. ఈ తరహాలో పోస్టర్‌ను ఆవిష్కరించడం ఇదే తొలిసారి అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
మాస్, యాక్షన్ డ్రామాగా దర్శకుడు హరి రూపొందుతున్న ఈ చిత్రాన్ని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్‌పై వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఏకధాటిగా జరుగుతోంది. ప్రియా భవానీ శంకర్, యోగిబాబు, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, రాజేశ్, కేజీయఫ్ రామచంద్రరాజు, అమ్ము అభిరామి, బోస్ వెంకట్, సంజీవ్, తలైవాసల్ విజరు, ఇమాన్ అన్నాచి, ఆడుకలమ్ జయాబాలన్, గంగై అమరణ్, ఐశ్వర్య రమా తదితరులు నటిస్తున్నారు.