Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన రోడ్ జర్నీ నేపథ్య చిత్రం 'ఇదే మా కథ'. గురు పవన్ దర్శకుడు.
శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్‌ను కథానాయకుడు వెంకటేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'టీజర్ చాలా బాగుంది. ఇలాంటి కొత్త తరహా చిత్రాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్' అని తెలిపారు.
ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ, 'టాలీవుడ్లో రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు, తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ, వారిలో చాలా మంది జీవించడంలో విఫలమవుతుంటారు. బైక్‌లపై సాధారణ భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్న భిన్న వయసులకు సంబంధించిన నలుగురి అపరిచితుల కథ ఇది. వీరంతా వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఏం తెలుసుకున్నారనేది? ఈ చిత్ర కథ. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనుంది' అని అన్నారు.