Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో రోహిత్ కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం 'కళాకార్'. శ్రీను బందెల దర్శకుడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర కథానాయకుడు ప్రభాస్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రోహిత్ నటించిన ఈ చిత్ర టీజర్ చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించేలా ఉండటం అభినందనీయం' అని అన్నారు.
'హీరో ప్రభాస్ మా చిత్ర టీజర్ విడుదల చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. టీజర్ చూసి చాలా బాగుందని అభినందించడం మా జీవితంలో మరచిపోలేని గొప్ప అనుభూతి. ఈ టీజర్ మాదిరిగానే సినిమా కూడా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని హీరో రోహిత్ చెప్పారు. దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ, 'ప్రభాస్ గారు మా టీజర్‌ని లాంచ్ చేసినందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సినిమా ఇది' అని తెలిపారు.
'మా బ్యానర్లో ఇది రెండో సినిమా. ఈ సినిమా టీజర్‌ని ప్రభాస్ లాంచ్ చేసి, చిన్న సినిమాకు సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సినిమా మొత్తం పూర్తయింది. త్వరలోనే ఫస్ట్ కాపీ వస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, దసరాకు మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని నిర్మాత వెంకటరెడ్డి చెప్పారు.