Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవి వర్మ, సంజనా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'బుల్లెట్'. మెమరీ మేకర్స్ సోమిశెట్టి హరికష్ణ సమర్పణలో, తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రమిది. చౌడప్ప దర్శకుడు. ఎం.సి.రావు, జి.గోపాల్, ఎమ్.వి. మల్లికార్జునరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, మణి నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు చౌడప్ప మాట్లాడుతూ, 'యాక్షన్ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. 'స్వచ్ఛ భారత్' అంటే గతంలో మాదిరిగా రోడ్లు ఊడ్చి, చెత్త ఎత్తివేయడం కాదు. దేశానికి పట్టిన చీడ పురుగులని ఏరేసే ప్రయత్నం అని, ఇప్పుడున్న ఈ సమాజానికి బుద్ధుడు కూడా రుద్రుడౌతాడని, బుద్ధం శరణం గచ్చామి కాదు యుద్ధం శరణం గచ్చామి అని చాటి చెప్పే సినిమా అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. హీరో రవి వర్మ కొత్తవాడైనప్పటికీ చాలా బాగా నటించాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత అతనికి చాలా మంచి ఆఫర్లు వస్తాయి. సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.
'ఇది నా ఫస్ట్ సినిమా. ఓ మంచి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది' అని హీరో రవి వర్మ అన్నారు. ఆలోక్ జైన్, మనీషా దేవ్, జీవ, విజయ రంగరాజు, సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, సందీప్ రెడ్డి, ఆనంద్ జాషువా, వైజాగ్ ప్రసాద్, గిరిధర్, మల్లికార్జున రావు, జగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు :నివాస్, కెమెరా :ఆనంద్ మురుకురి, సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటర్ : నందమూరి హరి, బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్.ఆర్ : చిన్న, ఆర్ట్స్ :రామకష్ణ.