Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు త్రివిక్రమ్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకుడు. ఈ చిత్రంలో 'డేనియల్ శేఖర్'గా రానా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయో తెలిపే ఫస్ట్లుక్తోపాటు 'బ్లిజ్ ఆఫ్ డేనియల్ శేఖర్' పేరుతో ఓ వీడియోని సైతం చిత్ర బృందం సోమవారం రిలీజ్ చేసింది. 'నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్లో టాక్ నడుస్తోంది... నేనెవరో తెలుసా ధర్మేంద్ర ...హీరో..హీరో..! డేనీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్...!'' అంటూ ఈ ప్రచార చిత్రంలో 'డేనియల్ శేఖర్' పాత్రధారి రానా చెప్పిన డైలాగ్స్ అందర్నీ అలరిస్తున్నాయి. 'ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి12న రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత తెలిపారు.