Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'మహా సముద్రం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజరు భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు.
'రిలీజ్ చేసిన పోస్టర్లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదవే లేదని వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన రెండు పాటలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ప్రొడక్షన్ డిజైనర్: కొల్లా అవినాశ్, ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్, యాక్షన్: వెంకట్.