Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ్ సర్ధార్, అజరు కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిస్టేక్'. ఏఎస్పీ మీడియా హౌస్ సంస్థ ప్రొడక్షన్ నెం.2గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ లాంచ్ చేసి, మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని చిత్ర బృందాన్ని అభినందించారు. 'ఈ చిత్ర టైటిల్‌గా 'మిస్టేక్' అని ఎందుకు పెట్టాం?, మోషన్ పోస్టర్లో ఉన్న నటీనటుల తీరు, చుట్టూ ఉన్న అంశాలన్ని ఆసక్తికరంగా ఎలా ఉన్నాయో, సినిమా కూడా ఆద్యంతం ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని మేకర్స్ తెలిపారు.
సమీర్, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : హరి జాస్తి, సంగీతం : మణి జెన్న, డైలాగ్స్ : శ్రీ హర్ష మండ, ఆర్ట్ : రవి కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నిధి, నిర్మాత : అభినవ్ సర్ధార్, దర్శకత్వం : సన్నీ కోమలపాటి.