Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజరు రావు హీరోగా, అనితా షిండే (తొలి పరిచయం) హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం 'ప్రేమిస్తే ఇంతే'. చక్ర ఇన్ఫోటైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్‌పై జై దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి సీఏ సిద్దార్థ్ క్లాప్ కొట్టి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు జై మాట్లాడుతూ, 'సాఫ్ట్వేర్ కంపెనీ నేపథ్యంలో హై ఫై లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని నిర్మాత సపోర్ట్ అందిస్తున్నారు. లవర్ బారుగా సంజరు రావు పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది' అని చెప్పారు. 'దర్శకుడు జై చెప్పిన కథ చాలా బాగుంది. నేటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. మా బ్యానర్ స్థాయిని పెంచే చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో శరవేగంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నాం' అని నిర్మాత వెంకటరత్నం అన్నారు.
అలీ, ఆర్.జె. హేమంత్, ఆర్.జె. కష్ణ, వెంకట కిరణ్, వైవా రాఘవ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: భాను ప్రసాద్ జె., లిరిక్స్: రాజు నల్లబెల్లి, ఫైట్స్: శివరాజు, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ సబ్బి, నిర్మాత: వెంకటరత్నం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జై.