Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కొత్త సినిమా 'మంచి రోజులు వచ్చాయి'. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎక్కేసిందే..' ప్రోమో సాంగ్ విడుదలైంది. సంతోష్ శోభన్, మెహరీన్ డాన్స్ ప్రోమోలో హైలైట్ అయింది. ఈనెల 23న పూర్తి సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ, ''టాక్సీవాలా' తర్వాత ఎస్కెఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ ఎస్కెఎన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో లేటెస్ట్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'ఏక్ మినీ కథ' లాంటి హిట్ సినిమాని నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ మరోసారి ఈ సినిమాలో నటిస్తున్నారు. మారుతి సినిమా అంటే కచ్చితంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోనూ అందర్నీ అలరించే కాన్సెప్ట్‌తోపాటు అన్ని రకాల ఎలిమెంట్సూ ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పబ్లిసిటీ కంటెంట్‌కి ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'ఎక్కేసిందే..' పాట ప్రోమో విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈనెల 23న పూర్తి పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.