Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం 'రౌడీ బార్సు'. దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుక బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ, 'ఇందులో 9 పాటలున్నాయి. పాటలన్ని ఆడియెన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇందులో ఉన్న రెండు కాలేజీ ఫెస్ట్ సాంగ్స్ అన్ని కాలేజీ ఫెస్ట్స్‌లో ప్లే అవుతాయని భావిస్తున్నా. దేవిశ్రీతో పనిచేయడం అనే నా కలను నేరవేర్చిన దిల్‌రాజుగారికి థ్యాంక్స్' అని అన్నారు.
'టైటిల్ సాంగ్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అనుపమ, దేవిశ్రీ, దిల్‌రాజుగారి వల్ల ఈ సినిమాకు చాలా మంచి క్రేజ్ వచ్చింది. డైరెక్టర్ హర్షకు, నా లుక్ విషయంలో కేర్ తీసుకున్న అక్కయ్యకు థ్యాంక్స్. థియేటర్స్‌లో కలుద్దాం' అని హీరో ఆశిష్ చెప్పారు.
దిల్‌రాజు మాట్లాడుతూ, 'ఈ సినిమా హీరో దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే అందరూ కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు రప్పించాలంటే ఫస్ట్ అందరినీ మెప్పించేది మ్యూజిక్కే. మా జర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. 'హుషారు' సినిమాతో యూత్ ఆడియెన్స్‌లో హుషారు నింపిన డైరెక్టర్ హర్ష, ఇప్పుడు నెక్ట్స్ లెవల్ మూవీ చేశాడు. యూత్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.అనుపమ పరమేశ్వరన్ ఎక్స్‌ట్రార్డినరిగా నటించింది. దేవిశ్రీ తర్వాత తనే సెకండ్ హీరో. ఆశిష్, విక్రమ్ కూడా చాలా బాగా చేశారు. దసరాకు సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ''ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న ఆశిష్‌కు అభినందనలు. హర్షతో వర్క్ చేయడం హ్యాపీ. తను యూత్‌ఫుల్‌గా ఈ సినిమాని చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చే సినిమా' అని చెప్పారు.