Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతువర్మ జంటగా రూపొందుతున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్యని దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'మనసులోనే నిలిచి పోకె.. మైమరపుల మధురిమ..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం బుధవారం రిలీజ్ చేసింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను గాయని చిన్మయి వీనుల విందుగా ఆలపించారు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెర రూపంగా ఈ పాట ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేకర్ మాట్లాడుతూ, 'ప్రముఖ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ పాటకు స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసుని ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి ఆలపించిన ఈ పాట మీకూ నచ్చుతుంది. ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హృదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు, నటీ నటుల అభినయాలు చిత్ర కథానుగుణంగా సాగి, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది' అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : పి.డి.వి.ప్రసాద్