Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. దేవ కట్టా దర్శకుడు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఆ భగవంతుడి దీవెనలతో, ప్రేక్షకాభిమానులందరి ఆశీస్సులతో సాయి తేజ్ హాస్పిటల్లో త్వరగా కోలుకుంటున్నాడు. తను హీరోగా చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం కొంచెం ఎమోషనల్‌గా ఫీలవుతున్నా. త్వరలోనే సాయితేజ్ మన మధ్యకు వస్తాడు. ఇక దేవ కట్టాగారు డైరెక్షన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకు గూజ్బంప్స్ వస్తున్నాయి. ఓ యంగ్ కలెక్టర్ రౌడీయిజాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయడం, ప్రజలకు ఎలాంటి రాజకీయ వ్యవస్థను ఎన్నుకోవాలో తెలియజేప్పే ప్రయత్నం చూస్తుంటే అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్న సినిమాలా అనిపిస్తుంది. సబ్జెక్ట్ విషయంలో దేవ కట్టాగారి నిజాయితి సుస్పష్టంగా తెలుస్తుంది. సాయితేజ్ డైనమిక్‌గా, సెటిల్డ్‌గా కనిపిస్తున్నాడు. కమర్షియల్‌గా సినిమా అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమాకు నిర్మాతలు కూడా పూర్తి సహకారం అందించారు. వారి ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలు, ప్రేక్షకులు కూడా వారి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఆలోచన రేకెత్తించే ఇలాంటి సినిమాలు రావాలి. ఓటర్లలో ఓ రెవల్యూషన్ రావాలని యూనిట్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను' అని చెప్పారు.
ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకష్ణ, బాక్సర్ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దేవ కట్టా, కిరణ్ జరు కుమార్, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, మ్యూజిక్: మణిశర్మ, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్.