Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు వాటిని విని, చదివి నేను ఎంతో బాధపడేదాన్ని. మనమేమీ చేయలేమా అని అనుకునేదాన్ని. అయితే 'లవ్‌స్టోరీ'లో మౌనిక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మనమేమి చేయగలమో చెప్పే ఛాన్స్ వచ్చింది.
కనీసం ఈ సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగినందుకు
చాలా సంతృప్తిగా ఉంది. ప్రతి అమ్మాయి, మహిళ చూడాల్సిన సినిమా'
అని అంటోంది కథానాయిక సాయిపల్లవి.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమా ఈనెల 24న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం నాయిక సాయిపల్లవి మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
పెళ్లైతే తన నేటివ్ ప్లేస్, ఫ్యామిలీని ఎందుకు వదిలి వెళ్లాలి అని 'ఫిదా'లో ఆలోచించే అమ్మాయి భానుమతిగా నటించా,
ఈ చిత్రంలో తన డ్రీమ్స్‌ను ఫాలో అవుతూ, నేను ఎందుకు తక్కువ అనే ఆత్మవిశ్వాసంతో ఉండే మౌనిక క్యారెక్టర్ లో నటించా. రెండూ పూర్తి భిన్నమైన పాత్రలు.
ఈ సినిమాలో చైతూ, నా క్యారెక్టర్స్ ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పించిన మంచి విషయం ఏంటంటే, మనలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు. కానీ ప్రయత్నించి సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు, ఏదైనా సాధ్యమవుతుంది. మా రెండు క్యారెక్టర్స్ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. నాగ చైతన్యతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. రేవంత్ క్యారెక్టర్‌ను ఆయన పర్పెక్ట్గా ప్లే చేశారు.
అలాగే లింగ వివక్ష, కుల వివక్ష లాంటి ఇష్యూను టచ్ చేశారు. వీటి గురించి ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో మంచి సందేశం ఉన్నా, ఎక్కడా బోర్ కొట్టించదు. కథను వినోదాత్మకంగా చూపించారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే నిజాయితీ ఈ సినిమాలోనూ ఉంటుంది. ఆయన తన జీవితంలో ఏది నమ్ముతారో, దాన్నే సినిమాగా తెరకెక్కిస్తుంటారు. ఈ సినిమా కూడా అందులో ఒకటి.
మెగాస్టార్ చిరంజీవిగారు నాతో డ్యాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారు. ఆయన నా డ్యాన్స్ గురించి చెబుతుంటే చాలా సంతోషం కలిగింది. ఇవన్నీ బెస్ట్ కాంప్లిమెంట్స్‌గా నాకు గుర్తుండిపోతాయి.
ప్రస్తుతం 'విరాటపర్వం', 'శ్యామ్ సింగరారు'తోపాటు తమిళ, మలయాళ భాషల్లో రెండు సినిమాలు చేస్తున్నాను. అలాగే ఓ వెబ్‌సిరీస్ గురించి చర్చలు జరుగుతున్నాయి.