Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంథని
మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ వేల్పుల రాజమ్మ, మారయ్యల జ్ఞాపకార్థం వారి కుమారులు వేల్పుల రవీందర్, కమల్, గట్టయ్య, సురేందర్ లు మైదుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నా విద్యార్థిని విద్యార్థులకు గురువారం నోట్ బుక్స్, పెన్నులను గ్రామ మాజీ సర్పంచ్ రామస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గ్రామ సర్పంచ్ రామస్వామి తో పాటు స్థానిక ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.