Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ముఖ్య తారాగణంగా నటిస్తున్న సినిమా 'రామ్ వర్సెస్ రావణ్'. సప్తగిరి ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. కె.శుక్రన్ దర్శకుడు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ''ఏంజెల్' సినిమా నేను దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రమిది. ఇదొక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారనేదే సినిమా. యాక్షన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కథలో కలిసి ఉంటుంది' అని చెప్పారు.
హీరో సొలమన్ జడ్సన్ మాట్లాడుతూ, 'ఇందులో నేను రామ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇదొక ఫెంటాస్టిక్ స్టోరి. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది' అని తెలిపారు. 'నేను ఈ మూవీలో రావణ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. పల్లెటూరిలోని సెన్సిటివ్ ఇష్యూస్‌ని మా డైరెక్టర్ చూపించబోతున్నారు' అని మరో హీరో రాజ్ బాలా తెలిపారు. హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ,'కథ వినగానే ఇదొక సూపర్ హిట్ సినిమా అనే నమ్మకం కలిగింది. ఓ మంచి పాత్ర నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.