Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్వేతా పరాశర్, యష్ పూరి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అలాంటి సిత్రాలు'. సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా గురువారం అర్థరాత్రి నుంచి 'జీ 5' ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా మీడియా కోసం గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకులు రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ, ''జీ 5' లాంటి గొప్ప ఓటీటీ వేదిక మా సినిమాని రిలీజ్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. జీ సంస్థకు చెందిన అనురాధ మేడమ్, సాయి ప్రకాష్, నిమ్మకాయల ప్రసాద్‌గారికి థ్యాంక్స్' అని చెప్పారు. 'సినిమా చూశాక... ప్రేక్షకులు, విమర్శకులు క్రాఫ్ట్స్ గురించి మాట్లాడతారని అనుకుంటున్నాను. మా టెక్నికల్ టీమ్ లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ప్రధాన తారాగణం అంతా అద్భుతంగా నటించారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఎంటర్టైన్మెంట్ గురించి కంటే కంటెంట్ గురించి అందరూ మాట్లాడతారు. ఇరవైమూడేళ్ల రాగ్ గాయకుడు, గిటారిస్ట్. అతడు తన కంటే వయసులో పెద్దదైన ఓ వ్యభిచారి పట్ల ఆకర్షితుడవుతాడు. కొట్లాట, గొడవలు మానేసి సాధారణ జీవితం గడపాలని ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌స్టర్ దిలీప్ పాత్రేమిటి?, బాక్సర్ కావాలని కలలు కనే యష్‌కు, ఈ ముగ్గురి కథకు సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి' అని దర్శకుడు సుప్రీత్ సి. కష్ణ చెప్పారు.ఈ చిత్రానికి ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్: అశ్వథ్ శివకుమార్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ శివకుమార్, మ్యూజిక్: సంతు కుమార్, ప్రొడ్యూసర్స్: సుప్రీత్ సి. కష్ణ, లొక్కు శ్రీ వరుణ్, డి. రాహుల్ రెడ్డి.