Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'మహా సముద్రం'. 'ఆర్ఎక్స్100' ఫేమ్ అజరు భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్ ఏఎంబీ మాల్లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు అజరు భూపతి మాట్లాడుతూ,' ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఇందులో ఓపెన్ డ్రామా, వయలెంట్ లవ్‌స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆర్టిస్ట్‌ల నటన, మంచి మ్యూజిక్, టెక్నీషియన్ల పని తీరు ఇలా ప్రతీది పరిపూర్ణంగా.. వంద శాతం మీకు కనిపిస్తాయి. ఇది మననేటివిటి చిత్రం. ప్రతీ ఒక్క కారెక్టర్ మహా అద్భుతంగా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని భావోద్వేగాలు ఇందులో ఉంటాయి. మహా అనేది అమ్మాయి పేరు. సముద్రానికి రెండు రకాల లక్షణాలుంటాయి. ఒకటి సైలెంట్‌గా ఉంటుంది. మరొకటి ఎగిసి పడుతుంటుంది. అందులో సైలెంట్ ఎవరు?, ఎగిసిపడేది ఎవరు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం కాదు.. బ్లాక్ బస్టర్ అయింది' అని చెప్పారు.
'తొమ్మిది పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ప్రతీ పాత్ర హీరోనే. ప్రతీ డైలాగ్ కూడా ఈ పాత్రల్లోంచే వస్తుంది. ఈ మధ్య కాలంలో చూడని సినిమా. చాలా చక్కగా దర్శకుడు అజరు ఈ కథ రాసుకున్నాడు. రాజ్‌తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. చేతన్ భరద్వాజ్ అదిరిపోయే పాటలు ఇచ్చాడు. ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుంటాయి. ప్రతీ ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూసే చిత్రం. ఇంత పెద్ద సినిమా తీయడానికి ముందుకొచ్చిన అనిల్ సుంకర గారికి థ్యాంక్స్.' అని హీరో శర్వానంద్ తెలిపారు.