Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఈ సినిమా నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. రియలిస్టిక్ చిత్రాలంటే నాకూ ఆసక్తే. 'మజిలీ' సినిమాలో ఈ సంతప్తి కొంత దొరికింది. ఈ సినిమాతో నెక్ట్లెవెల్ హ్యాపీనెస్ పొందా. ఇందులో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతా. శేఖర్ గారి చిత్రాల్లో కామన్‌గా హీరోయిన్ క్యారెక్టర్‌కు ఎక్కువ పేరొస్తుంది. కానీ ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు నా క్యారెక్టర్‌కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది.
సాయి పల్లవితో నటించడం ఎంజారు చేశాను. తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్ కూడా. శేఖర్ మాస్టర్‌తో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది. ఇందులోనూ మంచి స్టెప్పులు చేయించారు. పాటలన్నీ చాలా సిచ్చ్యువేషనల్గా ఉంటాయి. డ్యాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు. ఇటీవల దర్శకుడు సుకుమార్‌తో మాట్లాడినప్పుడు, నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందని చెప్పారు. ఇలాంటి సినిమాల గురించి నాకూ సజెషన్ ఇచ్చారు. ఆయన కూడా 'రంగస్థలం' నుంచి ఇదే ఫార్మెట్లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు.
మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో కూడా నటిస్తా. అమీర్ ఖాన్‌తో 'లాల్ సింగ్ చద్దా'లో నటించే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి, మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్ మెంట్ దొరికితే ఈ సినిమాని కచ్చితంగా చూపిస్తాం' అని తెలిపారు.
శేఖర్ కమ్ములతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, వ్యక్తిగా ఎదిగా. 'లవ్‌స్టోరీ'లో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూతో పాటు కుల వివక్ష, లింగ వివక్ష ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రేమకథ కూడా.