Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ జంటగా నటించిన చిత్రం 'రిచిగాడి పెళ్లి'. కె ఎస్ ఫిలిం వర్క్స్ పతాకంపై కె.ఎస్.హేమరాజ్ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకుని, ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల రిలీజైన అనంత్ శ్రీరామ్ రాసిన 'ఏమిటిది మతి లేదా.. ప్రాణమా' పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, ''ఇందులోని ''ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..'' పాట చూశాను. కైలాష్ గారు అత్యద్భుతంగా పాడారు. తన వాయిస్ ఈ పాటకి చాలా బాగుంది. నాకు హేమ రాజ్ 'వైశాలి' సినిమా నుంచి తెలుసు. ఈ సినిమాకు ఆయన పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అనంత శ్రీరామ్‌గారి లిరిక్స్‌ని కైలాస్ గారు బ్యూటిఫుల్‌గా పాడితే, సత్యన్ చాలా బాగా కంపోజ్ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.
''ఏమిటిది మతి లేదా.. ప్రాణమా' అనేది వేదాంతాన్ని బోధించే పాట. మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల ఎన్ని జీవితాల్లో, ఎన్ని ప్రేమల్లో, ఎన్ని స్నేహాల్లో ఎన్ని మార్పులు వస్తాయి, ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. మీ అందరినీ కచ్చితంగా నచ్చుతుంది' అని గీత రచయిత అనంత్ శ్రీరామ్ తెలిపారు. దర్శకుడు హేమరాజ్ మాట్లాడుతూ,'మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు. వారికి మా కతజ్ఞతలు. ఇంత మంచి పాట అందించిన అనంత శ్రీరామ్‌కు, సింగర్స్‌కు ధన్యవాదాలు. మా డిఓపి విజరు ఉలగనాథ్ చేసిన వర్క్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు. సత్య, కిషోర్ మర్రి శెట్టి, ప్రవీణ్ రెడ్డి, సతీష్ శెట్టి, బన్నీ వోక్స్, చందనరాజ్, కియారా నాయుడు, మాస్టర్ రాకేశ్ తమోఘ్నా తదితరులు నటిస్తున్నారు.