Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏంజెల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు కె. శుక్రన్. దర్శకత్వ శాఖలో మంచి అనుభవం ఉన్న ఆయన రాజమౌళి, ఎన్.శంకర్, వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి వంటి దర్శక దిగ్గజాల దగ్గర పనిచేశారు. వారికి ప్రియ శిష్యుడిగా ఎన్నో చిత్రాలకు పని చేశారు. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తొలి చిత్రం 'ఏంజెల్'తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ద్వితీయ ప్రయత్నంగా 'రామ్ వర్సెస్ రావణ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సొలమన్ జడ్సన్ హీరోగా, మనో చిత్ర హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ అతిథులుగా హాజరై దర్శకుడు శుక్రన్ని అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు కె .శుక్రన్ మాట్లాడుతూ, 'నేను దర్శకత్వ శాఖలో రాజమౌళి గారి దగ్గర 'బాహుబలి' సినిమాకు పనిచేశాను. అంతకముందు వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్ గారి దగ్గర వర్క్ చేశాను. నాకు మొదట 'ఏంజెల్' సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నిర్మాత సింధూర పువ్వు కష్ణారెడ్డి గారు. ఆయన నాకు దేవుడు లాంటి వారు. అలాగే నాకు సపోర్ట్ చేసిన మా దర్శకులు రాజమౌళి, వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్ వీళ్లందరి వల్లే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఒక ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. యాక్షన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. గ్రామీణ వాతావరణంలో రూపొంద బోయే ఈ సినిమాలోని కంటెంట్ అందర్నీ మెప్పిస్తుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నా. 'కపటధారి' లాంటి పెద్ద చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన నా మిత్రుడు రాజామతికి ఈ కథ బాగా నచ్చి, ముందు ఈ సినిమా కంప్లీట్ చేద్దామనటం ఎంతో సంతోషంగా ఉంది. 'ఏంజెల్' సినిమాను మించిన విజయం 'రామ్ వర్సెస్ రావణ్' సాధిస్తుందని భావిస్తున్నాను' అని తెలిపారు.