Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్షి, మధు, సంజరు, ప్రదీప్ ముఖ్య తారాగణంగా తెరకెక్కు తున్న చిత్రం 'ఎక్స్‌వైజెడ్'. మెట్రో స్టూడియోస్ అధినేత ఇ.వి.ఎన్. చారి దర్శకత్వంలో, కౌసల్య ఫిలిమ్స్ పతాకంపై సీనియర్ రాజకీయ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
రొమాంటిక్ క్రైమ్, యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి దర్శకుడు చారి మాట్లాడుతూ, 'ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో రూపొందిన చిత్రమిది. విశాఖ, దాని పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఖర్చుకు వెనకాడకుండా మా నిర్మాత ఈ సినిమాని ఎంతో రిచ్‌గా నిర్మించారు' అని తెలిపారు. 'ఆర్టిస్టులు కొత్తవారైనప్పటికీ చాలా పరిపక్వతతో నటించారు. సినిమా అనుకున్న దానికన్నా అద్భుతంగా రావడంతో విజయం ఖాయమనే ధీమా ఏర్పడింది. మా దర్శకులు ఇ.వి.ఎన్.చారి చాలా పక్కా ప్రణాళికతో చిత్రీకరణ పూర్తి చేశారు. సరికొత్త కాన్సెప్ట్‌తో నయా క్రైవమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది' అని నిర్మాత కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే : సంపత్ రాజు, కొంపల అర్చన, కెమెరా : సాయిరాం, ప్రవీణ్.కె., ఎడిటింగ్: రామ్.