Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎక్కేసిందే..' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.
దీనికి విశేష స్పందన లభిస్తున్న సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఫాస్ట్ పెప్పిగా ఉన్న ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రామ్ మిరియాల ఈ పాటను అద్భుతగా పాడారు. అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్ విశేష శ్రోతకాదరణ పొందింది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. 'ఎక్కేసిందే..' పాటలో సంతోష్ శోభన్, మెహరీన్ కెమిస్ట్రీ బాగుంది. 'మహానుభావుడు' లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్లో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. 'టాక్సీవాలా' తర్వాత ఎస్కెఎన్ నిర్మాణంలో వస్తున్న చిత్రమిది. మారుతి, వి సెల్యులాయిడ్ ఎస్కెఎన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'ఏక్ మినీ కథ' లాంటి హిట్ సినిమాని నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ మరోసారి నటించడం విశేషం. దర్శకుడు మారుతి మరోమారు వినూత్న కథతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఆయన మార్క్ మేకింగ్ స్టయిల్ ఫిదా చేస్తుంది' అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాత: వి సెల్యూలాయిడ్ ఎస్కెఎన్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకుడు: మారుతి.