Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'మహా సముద్రం' అజరు భూపతి దర్శకుడు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కు తున్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను ఫర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన ఈ ట్రైలర్ రిలీజైన రెండు రోజుల్లోనే 6.5 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో నెం.1 ట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఎంతో మంది సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంది. తాజాగా అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఈ ట్రైలర్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''మహా సముద్రం' ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌తో ఉంది. అలాగే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. శర్వానంద్, సిద్ధార్థ్, మహాసముద్రం టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్' అని ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కి 'మహా సముద్రం' టీమ్ ధన్యవాదాలు తెలిపింది.
అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా, జగపతి బాబు, రావు రమేష్, కేజీఎఫ్ రామచంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్: సుంకర్ రామబ్రహ్మం, కో ప్రొడ్యూసర్: అజరు సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, మ్యూజిక్: చైతన్య భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ప్రొడక్షన్ డిజైనర్: కొల్లా అవినాష్, ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్, యాక్షన్: వెంకట్, రచన-దర్శకత్వం: అజరు భూపతి.