Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. దేవ కట్టా దర్శకుడు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 'ఓ రోజు దేవకట్టాగారు ఫోన్ చేసి, ఈ సినిమా కథ చెప్పారు. ఇందులో మైరా పాత్ర మీరు చేయబోతున్నారని చెప్పారు. హీరోయిన్ క్యారెక్టర్ అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన కేవలం క్యారెక్టర్స్, వాటి ప్రాధాన్యత లేంటి? అని మాత్రమే చూస్తారు. ఇది పక్కా కమర్షియల్ మూవీ కాదు, డిఫరెంట్ మూవీ. రియల్ స్టోరిని తీసుకుని బలమైన ప్లాట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నేను ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను. ఓ సమస్య కారణంగా విదేశాల్లో ఉండే నా పాత్ర ఇండియాకు వస్తుంది. రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ట్రాక్ ఉండదు. మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. సినిమాలో లవ్ ప్రపోజ్ చేసే సీన్ కూడా ఉండదు. ఇది కేవలం హీరో, హీరోయిన్ సినిమా కాదు. సాయితేజ్, నాతో పాటు జగపతిబాబు, రమ్యకష్ణ తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా అనేది మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మనం సినిమా చూసినప్పుడు ఏదో ఒక పాయింట్‌కు కనెక్ట్ అవుతుంటాం. అలాంటి ఓ బలమైన సినిమా మాధ్యమంలో సమాజానికి అవసరమైన ఓ విషయాన్ని వివరిస్తూ ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నాను. త్వరలోనే కిరణ్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను' అని చెప్పారు.
సాయితేజ్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. సినిమాలో ప్రజలు తరపున మాట్లాడే పాత్రలో తను చాలా బాగా నటించాడు. ఇందులో కోర్టు రూమ్ సీన్ ఉంది. పది నిమిషాల పాటు సాగే ఆ సీన్‌ను తేజ్ సింగిల్ టేక్‌లో చేశాడు. ఆ సీన్ తర్వాత యూనిట్ అందరూ క్లాప్స్ కొట్టారు. తన కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది.