Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిరామ్ వర్మ,, సాత్విక రాజ్ జంటగా రూపొందిన చిత్రం 'నీతో'. బాలు శర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏ వి ఆర్ స్వామి, ఎం. ఆర్. కీర్తన, స్నేహాల్ జంగాల నిర్మించారు. మిలియన్ డ్రీమ్స్ పతాకంపై రూపొందిన ఈచిత్ర టీజర్ లాంచ్ వేడుక ఆదివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ, ''టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, నటీనటుల నటన.. అన్ని అద్భుతంగా ఉన్నాయి. సినిమా కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. డైరెక్టర్ బాలు మాట్లాడుతూ,'ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. రిలీజైన టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా' అని అన్నారు. 'మా ప్రొడ్యూసర్ స్వామి మూడు సినిమాలు తీశారు. ఆయనకు పెద్ద సక్సెస్ రావాలి. ట్రెండ్‌కి అనుగుణంగా ఉన్న మా సినిమాని అందరూ ఆదరించాలి' అని హీరో అభిరామ్ వర్మ చెప్పారు. ప్రొడ్యూసర్ ఎ.వి.ఆర్. స్వామి మాట్లాడుతూ, 'నేను 'రాహు' అనే మూవీతో నిర్మాతగా ప్రయాణం స్టార్ట్ చేశాను. బాలుగారితో ఒక సినిమా చేశాను. ఇప్పుడు 'నీతో' చేస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుంది' అని తెలిపారు.