Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ హీరో విజరుకి తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్టూ ఉంది. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై అఖండ విజయాల్నీ సొంతం చేసుకున్నాయి.
చాలా కాలంగా తెలుగులో నటించాలని అనుకుంటున్న విజరు ఆకాంక్ష త్వరలోనే నెరవేరబోతోంది. విజరు తన 66వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'విజరు, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్లో రూపొందబోతోన్న ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండిస్టీ వర్గాల్లో విపరీతమైన బజ్ నెలకొంది. సినిమా రంగం పట్ల అభిరుచి, నైపుణ్యం కలిగిన వ్యక్తుల కలయికతో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. విజరు ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో చేస్తున్న 'బీస్ట్' పూర్తి కాగానే, ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.