Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 15న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం విడుదల తేదీని ప్రకటిస్తూ సినిమాలోని ప్రధాన తారాగణంతో ఉన్న ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ''భలే భలే మగాడివోరు', 'పిల్లా నువ్వులేని జీవితం', 'గీత గోవిందం', 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీవాసు, దర్శకుడు వాసువర్మతో కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేశారు. దసరా పండగ నేపథ్యాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.