Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్‌కళ్యాణ్ అడిగిన ప్రతి మాటకి, ప్రశ్నకీ సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని అగ్ర కథానాయకుడు మోహన్‌బాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'రిపబ్లిక్' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర పరిశ్రమని ఇబ్బందుల్లో పెడుతున్న ఏపీ ప్రభుత్వాన్ని, నాయకులతోపాటు మోహన్‌బాబు విద్యా సంస్థల గురించి పవన్‌కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే థియేటర్ల మూసివేత, ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకంపై మోహన్‌బాబు కూడా స్పందించాలని పవన్ అన్నారు.
ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఆదివారం ఓ ట్వీట్‌ని పోస్ట్ చేశారు. 'పవన్ కల్యాణ్.. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు 'మా' ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నాడనే సంగతి నీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి, గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్యూ వెరీ మచ్' అని ట్వీట్లోపేర్కొన్నారు