Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత, ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత ఆర్.ఆర్.వెంకట్ (57) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ పై నాగార్జున, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, నాగచైతన్య, నాని, జగపతిబాబు వంటి తదితర అగ్ర హీరోలతో 'సామాన్యుడు', 'ఆంధ్రావాలా', 'ఢమరుకం', 'కిక్', 'ఆటోనగర్ సూర్య', 'మిరపకారు', 'బిజినెస్ మేన్', 'పైసా' సినిమాలను, అలాగే ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో 'డివోర్స్ ఇన్విటేషన్' హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించి, విజయాలతోపాటు అభిరుచిగల నిర్మాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. వెంకట్ మృతి పట్ల పరిశ్రమకు చెందిన పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.