Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'కొండపొలం'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా కథ ఏంటి?, దేని గురించి చెప్పబోతోన్నారనే క్లారిటీని ఇవ్వడంతోపాటు ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా ఉండబోతోందని ట్రైలర్ ద్వారా దర్శక, నిర్మాతలు చెప్పే ప్రయత్నం చేయటం విశేషం.
ఈ సందర్భంగా ట్రైలర్ గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఓ చదువుకున్న యువకుడు ఎందుకు తన తండ్రితో కలిసి 'కొండపొలం' అనే ఊరికి వెళ్ళాడు?, నీటి వసతి లేని అక్కడ మేకలు, గొర్రెలను పెంచటంతో పాటు క్రూర మగాల బారి నుంచి వాటిని కాపాడే బాధ్యతను ఎందుకు తీసుకున్నాడు?, అడవిలోని క్రూర మగాల కంటే ఘోరమైన, దారుణమైన మనుషుల వల్ల అతనికి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతుంటాయి?, వారితో ఆ యువకుడికి ఎదురైన పరిస్థితులు ఏంటి?, వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే కథ అని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. 'కొండపొలం' స్టోరీ లైన్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి సబ్జెక్ట్‌ను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించడంలో క్రిష్ నైపుణ్యం అందరికీ తెలిసిందే. జ్ఞాన శేఖర్ తన కెమెరా పనితనంతో అద్బుతమైన దశ్యాలను చూపించారు. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందరికీ గుర్తుండిపోయేలా ఉంది. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంట చూడటానికి ఎంతో ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన 'కొండ పొలం' నవల నుంచి ఈ కథ తీసుకున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 8న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు' అని తెలిపింది.