Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ రాముడిగా, కతి సనన్ సీతగా, సైఫ్ ఆలీఖాన్ రావణుడిగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ మాయాజాలంతో ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమాకి సంబంధించి ఓ కీలక అప్డేట్ను చిత్ర బృందం సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది, ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.