Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెరుపువేగంతో, బలమైన పంచులతో ప్రత్యర్థిని ఇట్టే చిత్తుచేసే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తొలిసారిఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు. నటుడిగా 'లైగర్' చిత్రంలో నటిస్తున్నారు.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన 'ఐరన్ మైక్' పాత్రధారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని 'లైగర్' చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. విజరు దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్' (సాలా క్రాస్ బ్రీడ్). పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్‌ని మా సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయటం ఎంతో అద్భుతమైన విషయం. మేము మా వాగ్దానాన్ని ఇప్పుడే ప్రారంభించాం. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్, బాక్సింగ్ గాడ్, ది లెజెండ్, ది బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఐరన్ మైక్ టైసన్..' అని విజరు దేవరకొండ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం 'లైగర్' చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారి పోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. ఈ చిత్రంలో రమ్యకష్ణ, రోనిత్ రారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా.