Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న విలక్షణ నటుడు పైడి జైరాజ్. అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మంగళవారం ఆయన 112వ జయంతిని మంగళవారం ఫిలిం ఛాంబర్లో నటుడు జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పైడి జైరాజ్ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళ్ళర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ,'పైడి జైరాజ్ తెలంగాణ నటుడు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం గర్వకారణం. అయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తి. అయన జ్ఞాపకార్ధంగా రవీంద్ర భారతిలో పైడి జైరాజ్ హాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే జైహింద్ గౌడ్ కోరినట్టు ఫిలింనగర్ ప్రాంతంలో ముఖ్యంగా ఛాంబర్ పరిధిలో అయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది' అని చెప్పారు. 'పైడి జైరాజ్ గొప్ప నటుడు. అలాంటి గొప్ప నటుడు గురించి తెలుగు పరిశ్రమ మరచిపోవడం బాధాకరం. అయన జీవితం మనందరికీ ఆదర్శం. ఆయన విగ్రహాన్ని ఫిల్మ్‌ఛాంబర్ ఆవరణలో ఏర్పాటు చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్నాం' అని అన్నారు.