Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న నూతన చిత్రం 'పుష్పక విమానం'. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు దామోదర పరిచయం అవుతున్నారు. హీరో విజరు దేవరకొండ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజరు దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. నవంబర్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు దామోదర మాట్లాడుతూ,'ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం. ఇందులో ఆనంద్ దేవరకొండ గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే డ్రామాని గుర్తు చేస్తుంది. అలాగే పెళ్లి చుట్టూ ఉండే పరిస్థితులనూ చూపిస్తుంది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రమిది. ఈ చిత్రంలోని 'కళ్యాణం కమనీయం..' పాట ఇప్పటికే విశేష ఆదరణ పొంది, సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు' అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : విజరు దేవరకొండ, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, రచన-దర్శకత్వం: దామోదర.