Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ డైరెక్టర్‌గా 'రిపబ్లిక్' చిత్రాన్ని నా విజన్‌తో తెరకెక్కించడానికి హీరో సాయితేజ్ ఓ సైనికుడిలా పని చేశాడు. ఈ సినిమాకి నా అజ్ఞానమే స్ఫూర్తి' అని అంటున్నారు దర్శకుడు దేవకట్టా. సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. దేవ కట్టా దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్ టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు దేవకట్టా మంగళవారం మీడియాతో సంభాషించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, లెజిస్లేటివ్ అనేవి ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఇవి మూడుగుర్రాలుగా ఉండి ప్రయాణించేటప్పుడు ఏదైనా ఓ గుర్రం గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే, మిగిలిన గుర్రాలు పట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా ఉంటుంది. బ్యూరోక్రాట్స్ మీద, న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే పాయింట్‌నూ ఈ సినిమాలో చూపించా.
ఇందులో ప్రజలకు ఏదీ మంచిది అనేది చెప్పలేదు.
ఓ ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకున్నప్పుడు, అది ఎలా అవ్యస్థంగా ఉందని ఎత్తి చూపిస్తూనే, అదొక వ్యవస్థగా మారాలని సొల్యూషన్‌గా నిర్వచనం చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడు సమాజంలోని వ్యవస్థలు,
మన ఆలోచనలు, దాని వల్ల ప్రభావితమయ్యే అంశాలు ఈ సినిమాలో ప్రతిబింబిస్తాయి.
సాధారణంగా రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య అన్వయకర్తగా ఉండే ఓ బ్యూరోక్రాట్ నిజాయితీగా ఉన్నప్పుడు, తను వ్యవస్థను ఎలా చూస్తున్నాడు?,
ఆ ఆలోచనల వల్ల తన ప్రయాణం ఎలా సాగింది?
అనే పాయింట్స్‌తో ఈ కథను తయారు చేశా. సాయితేజ్
ఓ కామన్ మ్యాన్‌గా ఈ కథకు రిలేట్ అయ్యాడు.
ఈ డిస్ట్రబెన్స్ నుంచి వచ్చిన ఐడియాలో నిజం ఉంది.
ఈ ఆలోచనను కథగా రాయక ముందే, నాతోనే ఈ సినిమా చేయాలని తేజ్ ప్రామిస్ తీసుకున్నాడు.
సెన్సార్ సభ్యులకు సినిమా చాలా బాగా నచ్చింది. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా నిస్పక్షపాతంగా, నిజాయితీగా తెరకెక్కించారని అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా చూసిన నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ రీమేక్ రైట్స్‌ను కూడా కొనేసింది. ఓ దర్శకుడిగా నాపై నమ్మకాన్ని పెంచే సినిమా అని నమ్ముతున్నాను.
చంద్రబాబునాయుడు, వైఎస్సార్ జీవితాల ఆధారంగా రూపొందించాల్సిన 'ఇంద్రప్రస్థం', 'బాహుబలి' వెబ్‌సిరీస్‌ల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది.
సాయితేజ్..100% ఓకే అనుకునే వరకు ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని భావించాం. తను త్వరగా కోలుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు. కొంచెం.. కొంచెం ఆహారం కూడా తీసుకుంటున్నాడు. అయితే రికవర్ కావడానికి ఇంకా సమయం పడుతుంది.