Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చ్తిరం 'కిన్నెరసాని'. నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి 'పార్వతి పురం...' అనే పాట విడుదలైంది. కిట్టు విస్సాప్రగడ ఈ పాటకు సాహిత్యం అందించగా, ఉమా నేహా, రేవంత్, ధనుంజరు సీపాన పాడారు.
ఈ పాటకు విశేష స్పందన లభిస్తున్న సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'కంటెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, మరో నిర్మాణ సంస్థ శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్తో కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 'కిన్నెరసాని' టైటిల్ పోస్టర్లో సైతం సినిమా కథాంశం ప్రతిబింబించేలా ప్రశాంతమైన సముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేశారు. అలానే 'కిన్నెరసాని' టైటిల్‌కి క్యాప్షన్‌గా 'అతి సర్వత్ర వర్జయత్' (హద్దు లేకపోవడం ప్రమాదకరం) అనే సంస్కత పదాన్ని కూడా జోడించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ డ్రామాగా ఈ టీజర్ అందర్నీ బాగా అలరించింది. ఇక లేటెస్ట్గా విడుదలైన 'పార్వతిపురం..' పాటకు సైతం అద్భుతమైన స్పందన లభించటం ఆనందంగా ఉంది. 'ఛలో', 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకి కూడా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ చిత్రానికి 'కల్కి'ఫేమ్ దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. భిన్న కథతో రూపొందుతున్న ఈ చిత్రం అందరి అంచనాలకు మించి ఉంటుంది' అని తెలిపారు.